Gujarat: వివాహానికి ముందు భారీ ఊరేగింపు నిర్వహించి అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించిన వధూవరులు

  • దేశంలో ఉన్నవి 1427 సింహాలు కాదు
  • సరిహద్దులో 13 లక్షల సింహాలు కాపు కాస్తున్నాయి
  • గుజరాత్‌లోని వడోదరలో పెళ్లికి ముందు ఘటన

గుజరాత్‌లోని వడోదరలో ఓ జంట పెళ్లికి ముందు ఊరేగింపు నిర్వహించి పుల్వామా అమరులకు ఘనంగా నివాళులర్పించింది. ‘‘ ఎవరు చెప్పారు దేశంలో 1,427 సింహాలు మాత్రమే ఉన్నాయని? దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో 13 లక్షల సింహాలున్నాయి’’ అని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ఊరేంగిపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని అమరులకు నివాళులర్పించారు.

కాగా, శుక్రవారం గుజరాత్‌కే చెందిన ఓ వజ్రాల వ్యాపారి తన కుమార్తె పెళ్లి విందును  రద్దు చేసి 11 లక్షల రూపాయలను అమరుల కుటుంబాలకు, రూ.5 లక్షలను సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వ్యాపారి దేవాషి మానెక్ తన కుమార్తె అమీ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. పెళ్లి అనంతరం నిర్వహించాల్సిన విందును రద్దు చేసి ఆ సొమ్మును అమరుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించి అందరి హృదయాలను దోచుకున్నారు.

  • Loading...

More Telugu News