: జాతీయ స్థాయి అంధుల చెస్ పోటీలు
బేగంపేటలోని దేవ్ నార్ అంధుల పాఠశాలలో జాతీయస్థాయి అంధుల చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను అదనపు డీజీపీ ప్రారంభిస్తూ సామాన్య వ్యక్తులకు దీటుగా అంధులకు ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ పోటీల్లో 13 రాష్ట్రాలకు చెందిన 150 మంది అంధ విద్యార్థినీ విద్యార్ధులతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి అంధ చెస్ క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు.