: మన్మోహన్ కు షరీఫ్ ఆహ్వానంపై అమెరికా స్పందన
ప్రధానిగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను నవాజ్ షరీఫ్ ఆహ్వానించడాన్ని అమెరికా స్వాగతించింది. భారత్, పాక్ సంబంధాల దృష్ట్యా ఈ పరిణామాన్ని ఓ సానుకూల సంకేతంగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి జెన్ సాకీ మాట్లాడుతూ, షరీఫ్ వ్యాఖ్యలను మరీ ఎక్కువగా విశ్లేషించబోమని, పాక్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. ఇక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో షరీఫ్ ప్రభుత్వంతో కలిసి ముందుకుసాగుతామని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాన్ కెర్రీ చెప్పారు.