nagachaitanya: 'మజిలీ' నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • శివ నిర్వాణ తదుపరి చిత్రంగా 'మజిలీ'
  • ఈ నెల 14న టీజర్ రిలీజ్
  •  ఏప్రిల్ 5న సినిమా రిలీజ్    

శివ నిర్వాణ దర్శకత్వంలో ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నిన్నుకోరి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని, ఆయన మరో ప్రేమకథను సిద్ధం చేసుకున్నాడు. 'మజిలీ' పేరుతో ఈ కథను రూపొందిస్తున్నాడు. చైతూ .. సమంత నాయకా నాయికలుగా ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆ రోజున ఉదయం 9 గంటల 9 నిమిషాలకి టీజర్ ను వదలనున్నట్టుగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను కూడా వదిలారు. గోపిసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News