Andhra Pradesh: 2019లో చంద్రబాబుకు యూటర్న్ కష్టం ఉండదు..ఆయన్ను ప్రజలు నారావారిపల్లెకు పంపుతారు!: కన్నా సెటైర్లు
- బాబు మహానాటకానికి తెరదీశారు
- ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారు
- ట్విట్టర్ లో మండిపడ్డ బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మహానాటకానికి తెరతీశారని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఆయన దొంగ దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో యూటర్న్ తీసుకునే అవసరం లేకుండా ప్రజలు చంద్రబాబును నారావారి పల్లెకు పంపిస్తారని సెటైర్ వేశారు.
ఈరోజు ట్విట్టర్ లో కన్నా స్పందిస్తూ..‘మరో మహా నాటకం.! ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.. మీరు U-టర్న్ సీఎం అని ప్రజలు భావిస్తున్నారు.. 2019లో U-టర్న్ తీసుకునే కష్టం లేకుండా "నారావారి పల్లె"కి పంపిస్తారు’ అని ట్వీట్ చేశారు.