: కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా ఆటోల బంద్
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 20, 21 తేదీల్లో ఆటోలు బంద్ కానున్నాయి. కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సమ్మెకు మద్దతుగా ఆ రెండు రోజులు బంద్ నిర్వహించున్నట్లు ఆటో సంఘాల ఐకాస ప్రకటించింది. ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆటో సంఘాల నేతలు డిమాండ్ చేశారు.