: ఎంజెలినా జోలీ కేన్సర్ అనుభవాలు
హాలీవుడ్ యాక్షన్, రొమాంటిక్ కథానాయిక ఏంజెలినా జోలీ భవిష్యత్తులో కేన్సర్ బారిన పడడానికి అవకాశాలున్నాయని తేలిందట. 87శాతం బ్రెస్ట్ కేన్సర్, 50 శాతం ఒవేరియన్ కేన్సర్ ఆమెకు వచ్చే అవకాశాలున్నాయని రక్త పరీక్షలలో తేలినట్లు ఏంజెలినా స్వయంగా చెప్పింది. తల్లి నుంచి తనకు సంక్రమించిన అరుదైన జన్యువు ఫలితంగానే తనకీ ప్రమాదం ఉందని ఏంజెలినా చెప్పింది. అయితే ముందుగా తెలుసుకోవడం వల్ల ఇప్పుడు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు 5 శాతానికి తగ్గిపోయాయని తన బ్లాగులో పేర్కొంది. తన అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకొస్తుందట. దానివల్ల ఇతర మహిళలకు ఉపయోగం ఉంటుందని ఏంజెలినా చెప్పింది. చిన్న రక్త పరీక్ష ద్వారానే కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తెలుసుకోవచ్చని చెబుతోంది.