: తిరుమలలో వర్తకులకు భూమన అండ
తిరుమలలో దుకాణదారులకు స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన భూమన కరుణాకరరెడ్డి అండగా నిలిచారు. దుకాణదారులను వేధిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారి దగ్గర నుంచి టీటీడీ రాయల్టీ వసూలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ రోజు కరుణాకరరెడ్డి తిరుమలలో పర్యటించారు. దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.