Sabarimala: అయ్యప్పను దర్శించుకున్నది 51 మంది మహిళలు కాదు ..ఇద్దరే!: కేరళ సర్కారు యూ-టర్న్

  • గతంలో 51 మంది దర్శించుకున్నట్టు సర్కారు అఫిడవిట్
  • ఇప్పుడు మాట మార్చి ఇద్దరేనంటున్న పినరయి ప్రభుత్వం
  • ఏ వయసు మహిళైనా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పు

కేరళ, శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని 51 మంది మహిళలు సందర్శించారని గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిన కేరళ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. ఆలయంలోకి 51 మంది మహిళలు వెళ్లినట్టు తామిచ్చిన అఫిడవిట్ సరికాదని తేలిందని, ఇప్పటివరకూ ఇద్దరు మహిళలు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని తాజాగా పేర్కొంది.

మకరవిళక్కు సమయంలో బిందు అమ్మణ్ణి, కనకదుర్గలు పోలీసుల ఆలయంలోకి వెళ్లగా, ఆలయాన్ని మూసివేసి, తిరిగి శుద్ధి కార్యక్రమాల అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించిన సంగతి తెలిసిందే. అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళైనా వెళ్లవచ్చని, సుప్రీంకోర్టు గత సంవత్సరంలో తీర్పు ఇచ్చిన తరువాత, ఆలయాన్ని నాలుగుసార్లు తెరువగా, ఇద్దరు మహిళలు జనవరి తొలివారంలో స్వామి సన్నిధికి వెళ్లి చరిత్ర సృష్టించారు. పలువురు మహిళలు ఇదే ప్రయత్నం చేసినప్పటికీ భక్తుల నిరసనల కారణంగా స్వామిని చేరలేకపోయారు.

More Telugu News