: నేను ఒంటరి వాడిని: రణబీర్ కపూర్
తాను ఒంటరివాడినని స్మార్ట్ హీరో రణబీర్ కపూర్ క్లూ ఇచ్చాడు. ఒంటిరివాడినని, ఒంటరిగా ప్రయాణించడమే ఇష్టమని చెప్పేశాడు. తోడు కూడా అవసరం లేదని కటువుగా చెప్పేశాడు. ఆఖరికి లంచ్ కూడా ఒంటరిగానే కానిచ్చేస్తాడట. ఒంటరితనమే సౌకర్యంగా ఉంటుందట. మొత్తానికి ఒంటరితనం రణబీర్ కు తెగనచ్చేసిందని ఆయన మాటలు వింటుంటే అనిపిస్తోంది.