Chandrababu: జగన్ కోర్టుకు వెళుతుంటారు.. నేను మాత్రం ప్రజల్లో ఉంటా: చంద్రబాబు
- అమరావతిలో రూ. 50 వేల కోట్ల పనులు పూర్తికాబోతున్నాయి
- పోగొట్టేది వైసీపీ... రాబట్టేది టీడీపీ
- ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలు గుర్తించాలి
వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేది జగన్ అయితే... ప్రతి రోజు ప్రజల్లో ఉండేది తానని అన్నారు. అప నమ్మకానికి వైసీపీ ప్రతీక అయితే... నమ్మకానికి టీడీపీ ప్రతీక అని చెప్పారు. అమరావతిలో రూ. 50 వేల కోట్ల విలువైన పనులు పూర్తికాబోతున్నాయని తెలిపారు.
అధికారుల ప్రతిష్టను టీడీపీ పెంచితే... అధికారులను వైసీపీ జైలుపాలు చేసిందని విమర్శించారు. వారి హయాంలో ఫోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీ వెళ్లిపోయిందని... తాము కియా కార్ల పరిశ్రమను ఏపీకి తీసుకొచ్చామని తెలిపారు. పోగొట్టేది వైసీపీ అయితే... రాబట్టేది టీడీపీ అని చెప్పారు. ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలు గుర్తించాలని అన్నారు. టీడీపీని నమ్మితే నష్టం ఉండదనే భరోసాతోనే రాజధాని కోసం రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.