: విప్ ధిక్కరించిన వారిపై వేటేయాలి: స్పీకర్ ను కోరిన టీడీపీ


పార్టీ విప్ ధిక్కరించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వేటేయాలని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కు టీడీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఈ రోజు స్పీకర్ విచారణ చేపట్టారు. అయితే, విప్ ధిక్కరించిన ఒక్క ఎమ్మెల్యే కూడా దీనికి హాజరు కాలేదు. కేవలం టీడీపీ తరఫున ధూళిపాళ్ల నరేంద్ర హాజరై తమ వాదన వినిపించారు.

  • Loading...

More Telugu News