Newzealand: ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం దాదాపు అసాధ్యం: ఐసీసీ సీఈవో

  • ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించిన రిచర్డ్‌సన్
  • నాలుగో వన్డేలో కివీస్ ఘన విజయంపై స్పందన
  • ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం అసాధ్యమన్న ఐసీసీ సీఈవో

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హమిల్టన్‌లో భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో కివీస్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూకట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ 30.5 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 93 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మరో 212 బంతులు మిగిలి ఉండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఈ నేపథ్యంలో, ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించేందుకు భారత్ వచ్చిన ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించడం దాదాపు అసాధ్యమన్నారు. కోహ్లీ సేన బలంగా కనిపిస్తోందన్నారు. నాలుగో వన్డేలో టీమిండియాపై కివీస్ ఘన విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ.. ఎవ్వరి డాగ్ హేజ్ ఇట్స్ డే (ఎలాంటి వాళ్లనైనా ఎప్పుడో ఒకప్పుడు విజయం వరిస్తుంది) అంటూ కామెంట్ చేశారు. అలాగే, ఇప్పుడు న్యూజిలాండ్‌ కూడా అని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్ ఆదివారం చివరి వన్డేలో కివీస్‌తో తలపడనుంది.

More Telugu News