ajith: 200 కోట్ల దిశగా అజిత్ 'విశ్వాసం'

  • క్రితం నెల 10న వచ్చిన 'విశ్వాసం'
  • ఇంతవరకూ 180 కోట్ల వసూళ్లు
  •  ఇంకా కొనసాగుతూనే వున్న జోరు

అజిత్ .. నయనతార కాంబినేషన్లో .. శివ దర్శకత్వంలో 'విశ్వాసం' రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, క్రితం నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ బంపర్ హిట్ అనిపించుకుంది.

రజనీకాంత్ 'పేట' గట్టిపోటీ ఇచ్చినప్పటికీ .. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంతవరకూ 180 కోట్లను వసూలు చేసింది. మరో రెండు వారాల పాటు ఈ సినిమా వసూళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. బీసీ సెంటర్లలో ఈ సినిమా జోరు కొనసాగుతూ ఉండటంతో, త్వరలో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఆరంభంలోనే అజిత్ కూడా భారీ విజయాన్నే సొంతం చేసుకున్నాడన్న మాట. 

More Telugu News