nda: రైతుబంధు పథకం తరహాలో కొత్త పథాకాన్ని ప్రకటించిన కేంద్రం.. రైతుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు

  • 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు కేంద్రం వరాలు
  • ఏడాదికి రూ. 6 వేల చొప్పున అందజేత
  • 2018 డిసెంబర్ నుంచి అమలు

2019-20 మధ్యంతర బడ్జెట్ లో చిన్న, సన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రకటించింది. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం మాదిరి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున అందజేయనున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అందజేస్తారు. ఈ పథకం వల్ల 12 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రైతుల ఖాతాల్లోకే నేరుగా ఈ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు. రైతులు సంతోషంగా బతకాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

More Telugu News