: తరలిన మహాసేన్ తుపాను


మహాసేన్ తుపాను ముప్పు రాష్ట్రానికి తప్పినట్టే. ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తూర్పుదిశగా ప్రయాణిస్తూ చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరి కొన్ని గంటల్లో ఉత్తర దిశగా కదిలి బంగ్లాదేశ్, మయన్మార్ తీరంవైపు వెళ్ళిపోతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్ళే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్టణం, కృష్ణపట్నం, నిజాం పట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News