jagan: జగన్ పై దాడి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

  • కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
  • విచారణ ఇంకా కొనసాగుతోందంటూ కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ
  • అక్టోబర్ 25న జగన్ పై దాడి

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ వేసింది. నిందితుడు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల  లేఖను కూడా ఛార్జ్ షీట్ కు జతచేసింది. ఛార్జ్ షీట్ లో ఏ1గా శ్రీనివాసరావును పేర్కొంది. ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పటికీ... విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకు ఈ సందర్భంగా తెలిపింది.

అక్టోబర్ 25వ తేదీన విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని ఎయిర్ పోర్టులో పనిచేసే శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడికత్తితో దాడి చేశాడు. దీన్ని ఏపీ పోలీసులు విచారిస్తున్న తరుణంలో... కేంద్ర ప్రభుత్వం కేసు విచారణను హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏకు అప్పగించింది.

More Telugu News