anil ravipudi: పారితోషికాన్ని ఐదు కోట్లకు పెంచేసిన అనిల్ రావిపూడి?

  • వరుస విజయాల అనిల్ రావిపూడి
  • సంక్రాంతి బరిలో విజేతగా నిలిచిన 'ఎఫ్ 2' 
  • ఉత్సాహాన్ని చూపుతోన్న హీరోలు

అపజయమెరుగని దర్శకులుగా రాజమౌళి .. కొరటాల శివ తరువాత స్థానంలో అనిల్ రావిపూడి కనిపిస్తున్నాడు. 'పటాస్' .. 'సుప్రీమ్' .. ' రాజా ది గ్రేట్ ' సినిమాలతో ఆయన హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్లలో 'కథానాయకుడు' .. 'విన విధేయ రామ' వంటి పెద్ద సినిమాలు ఉండగా, ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో చాలామంది స్టార్ హీరోలు అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. యువ హీరోలైతే పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన డిమాండ్ కి తగినట్టుగా పారితోషికం పెంచేసినట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ సినిమాకి 3 కోట్ల వరకూ తీసుకుంటూ వచ్చిన ఆయన, 5 కోట్లకి పైగా తన పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఆయన తాజా చిత్రానికి సంబంధించిన విషయాలు తెలియనున్నాయి. 

More Telugu News