Telangana: కూటముల కోసం ఇద్దరు చంద్రులు శ్రీకారం చుట్టారు!: బీజేపీ నేత లక్ష్మణ్ సెటైర్

  • కుటుంబ ప్రయోజనాల కోసమే ఫ్రంట్ల ఏర్పాటు
  • వాటికి అజెండా, జాతీయ దృక్పథం లేవు 
  • హైదరాబాద్ లో మీడియాతో బీజేపీ తెలంగాణ చీఫ్

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏర్పడుతున్న కూటములు కుటుంబ ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని లక్ష్మణ్ తెలిపారు. వాటికి ఎలాంటి జాతీయ దృక్పథం, అజెండా లేవని విమర్శించారు. ఇలా గతంలో ఏర్పడ్డ చాలా కూటములు విఫలం అయ్యాయని గుర్తుచేశారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు వేశారని లక్ష్మణ్ తెలిపారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ప్రజలు మోదీకి పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ సాధించబోయేది ఏదీ లేదని స్పష్టం చేశారు. కూటములుగా ఏర్పడే వాళ్లు తమ నాయకులు ఎవరో తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినా ఇప్పటివరకూ ప్రభుత్వ ఏర్పాటు పూర్తికాలేదన్నారు. ఫ్రంట్‌ల కోసం ఇద్దరు చంద్రులు శ్రీకారం చుట్టారని లక్ష్మణ్ సెటైర్ వేశారు.

More Telugu News