Andhra Pradesh: ఏపీలో 65 లక్షలు దాటిన టీడీపీ సభ్యత్వాలు.. శభాష్ అంటూ అభినందించిన మంత్రి నారా లోకేశ్!

  • అగ్రస్థానంలో నిలిచిన పాలకొల్లు
  • నెల్లూరు నుంచి ఆత్మకూరు, ఉదయగిరికి చోటు
  • కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడ్డామన్న లోకేశ్

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు 65 లక్షలు దాటింది. టీడీపీ సభ్యత్వ నమోదులో పాలకొల్లు, కుప్పం, ఉదయగిరి, ఆత్మకూరు, మైలవరం తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కాగా, సభ్యత్వ నమోదులో సరికొత్త రికార్డు సృష్టించిన కార్యకర్తలు, నేతలకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ పెద్దపీట వేస్తుందని లోకేశ్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ 4,178 మంది కార్యకర్తలకు రూ.14 కోట్లకు పైగా సాయం చేశామని లోకేశ్ చెప్పారు. అలాగే ప్రమాదాల్లో చనిపోయిన 3,031 మంది కార్యకర్తల కుటుంబాలకు బీమా కింద రూ.60.62 కోట్లు అందించి ఆదుకున్నామని పేర్కొన్నారు. వేర్వేరు ఘటనల్లో ప్రమాదవశాత్తూ గాయపడ్డ 89 మంది టీడీపీ కార్యకర్తలకు రూ.52.80 లక్షలు సాయం చేశామని లోకేశ్ అన్నారు. ఇక టీడీపీ కార్యకర్తలకు చెందిన 815 మంది పిల్లల చదువుల కోసం పార్టీ తరఫున రూ.2.28 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News