Andhra Pradesh: చంద్రబాబు రోజుకో మాట మాట్లాడతారు: జీవీఎల్ విమర్శలు

- ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం
- అవినీతి, అసూయతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు
- జగన్ పై దాడి ఘటనను బాబు డ్రామాగా చిత్రీకరించారు
చంద్రబాబు రోజుకో మాట మాట్లాడతారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,అనేక సందర్భాల్లో చంద్రబాబు మాట మార్చారని, ఏపీలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్నది అధ్వానమైన ప్రభుత్వమని, అవినీతి, అసూయతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ పై దాడి ఘటనను చంద్రబాబు డ్రామాగా చిత్రీకరించారని, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ చర్యలు చేపడితే మీకెందుకు భయం? అని ప్రశ్నించారు.