: అనుభవాలే పెరుగుదలకు పునాదులు
నిజజీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఒక్క కొత్త అనుభవం మన ఎదుగుదలకు తోడ్పడుతుందట. అంటే మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలు మన మెదడులో కొత్త కణాల ఎదుగుదలకు తోడ్పడతాయని జర్మనీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. మన అనుభవాల ద్వారా సంభవించే ఇలాంటి పెరుగుదల వ్యక్తుల వ్యక్తిత్వాలను, ప్రవర్తనా సరళిని ప్రధానంగా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనం యుక్తవయసు వచ్చిన దగ్గరినుండి మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు చేసే ప్రయత్నాలు వంటి వాటివల్ల మన మెదడులో కొత్త కణాల పెరుగుదల ఉంటుందని వీరు చెబుతున్నారు. మెదడు నిర్మాణ వ్యవస్థలకు ఉండే సంబంధాన్ని నిర్ధారించే దిశగా ఈ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. తమ పరిశోధనలో ఎలుకలను అన్నింటినీ ఒకే రకమైన వాతావరణంలో ఉంచినా కూడా అవన్నీ వేటికవే స్వతంత్ర భావాలను, తమదైన ప్రత్యేక శైలిని వ్యక్తం చేశాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.