CBI: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఎదురుదెబ్బ... పదవి నుంచి తప్పించిన కేంద్రం!

  • ఆయనపై ఆరోపణలను సమర్ధించిన సెలెక్ట్ కమిటీ
  • 24 గంటల్లో రెండుసార్లు సమావేశమైన కమిటీ
  • అలోక్ వర్మను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయాలని నిర్ణయం

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ఎదురుదెబ్బ తగిలింది. సీవీసీ నివేదికలో ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలను సెలెక్ట్ కమిటీ సమర్ధించింది. దీంతో, ఆ పదవి నుంచి అలోక్ వర్మను కేంద్రం తప్పించింది. ఆ పదవి నుంచి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయాలని హైపవర్ కమిటీ నిర్ణయించింది.

ఇరవై నాలుగు గంటల్లో రెండుసార్లు హైపవర్ కమిటీ సమావేశమైంది, అలోక్ వర్మను తొలగిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు అనంతరం నిన్ననే ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 12 మంది సీబీఐ అధికారులను ఆయన బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

More Telugu News