: తెలంగాణపై షిండే వ్యాఖ్యలు బాధాకరం: పొన్నం


తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నారని ఆయన చెప్పారు. తమ రాజీనామా లేఖలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వద్దే ఉన్నాయని పొన్నం తెలిపారు. తెలంగాణ నేతలు, ఎంపీలు కలిసికట్టుగా ఉన్నారని, సీమాంధ్ర నేతల్లా విడిపోయి లేమని ఆయన అన్నారు. తెలంగాణకు తెర పడలేదని, అయితే ఆలస్యం అవుతుందని కేంద్ర హోంమంత్రి షిండే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News