gopi ganesh: సత్యదేవ్ భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు: 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేశ్
- 'శతురంగ వేట్టై'కి ఇది రీమేక్
- కథలో కొన్ని మార్పులు చేశాను
- డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది
తమిళంలో వినోద్ దర్శకత్వంలో 2014లో వచ్చిన 'శతురంగ వేట్టై' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఆ సినిమాను తెలుగులోకి 'బ్లఫ్ మాస్టర్' పేరుతో రీమేక్ చేశారు. తాజాగా ఆ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో దర్శకుడు గోపీ గణేశ్ మాట్లాడారు. "నేటివిటీని .. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని అసలు కథలో మార్పులు .. చేర్పులు చేశాను. సంభాషణలను వాడుక భాషలో రాసుకున్నాను.
ఈ కారణంగానే డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూస్తూ సత్యదేవ్ .. నేను చాలా ఎంజాయ్ చేశాము. డైలాగ్స్ కి ఆడియన్స్ విజిల్స్ కొడుతుంటే మాకు చాలా సంతోషంగా అనిపించింది. సత్యదేవ్ గారి భార్య సినిమా చూసిన తరువాత నాకు కాల్ చేశారు. 'సత్యదేవ్ ను బాగా ప్రేమించే వ్యక్తిని నేనే మాత్రమేనని అనుకుంటూ ఉండేదానిని. నా కంటే ఎంతో గొప్పగా మీరు ఆయనని ప్రేమించడం వల్లనే తెరపై అంత అద్భుతంగా చూపించగలిగారు" అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారని చెప్పుకొచ్చాడు.