Chandrababu: చంద్రబాబును వ్యక్తిగతంగా నేనెప్పుడూ విమర్శించలేదు: వైఎస్ జగన్
- ఒక్కోసారి బీపీ వచ్చి బాబే ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు
- బాబు తమ మంత్రులు, ఎంపీలతో కూడా మాట్లాడిస్తాడు
- వాళ్లు తిడుతున్నా కూడా బాబు ఖండించడు
ఏపీ సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా తానెప్పుడూ విమర్శించలేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడి గురించి వ్యక్తిగతంగా నేనైతే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబునాయుడి గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడి ఉంటే నాకు చెప్పండి. నేను మాట్లాడిన ప్రతిమాటా ఆయన చేసిన తప్పును ఎత్తి చూపించడమే.
‘అయ్యా, చంద్రబాబు గారు..మీరు ఈ మాట అన్నారు. ఇది చేశారు. ఇది అన్యాయం కాదా? ఇది చెయ్యడానికి మీకు సిగ్గులేదా?..ఏదైనా కూడా వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు. ఒక్కోసారి బీపీ వచ్చి ఆయనే (చంద్రబాబు) ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఆయనా మాట్లాడతాడు, పక్కనుండే మంత్రుల చేత, తన ఎంపీల చేత మాట్లాడిస్తాడు. వాళ్లు తిడుతున్నా కూడా ఈయన ఖండించకపోగా వికటానందం పొందుతూ ఉంటాడు. అది, ఈ మనిషికి ఉన్న దిగజారుడు గుణానికి నిదర్శనం’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.