: సెకనులో సినిమా డౌన్ లోడ్!
కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అత్యంత వేగవంతమైన ఐదో తరం వైర్ లెస్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. 5జిగా పేర్కొంటున్న ఈ పరిజ్ఞానం సాయంతో సినిమా మొత్తాన్ని ఒక్క సెకనులోనే డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుందని శాంసంగ్ అంటోంది. ఈ సంస్థ రెండు కిలోమీటర్ల పరిధిలో ఓ గిగాబైట్ సమాచారాన్ని తాజా టెక్నాలజీ సాయంతో విజయవంతంగా పరస్పర మార్పిడి చేయడంలో సఫలీకృతమైంది.
ఈ 5జి సాంకేతికతతో పైళ్ళను, అత్యంత నాణ్యతతో కూడిన సినిమాలను ఏకబిగిన డౌన్ లోడ్ చేసుకోవచ్చని, 3డి చిత్రాలు, గేమ్స్, అల్ట్రా హై డెఫినిషన్ (యూహెచ్ డీ) ప్రసారాలను మొబైళ్ళలో వీక్షించడం సులభతరం అవుతుందని శాంసంగ్ భరోసా ఇస్తోంది. అయితే, మరింత కచ్చితత్వం కోసం ఇంకొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ సూపర్ టెక్నాలజీ 2020 నాటికి అందుబాటులో వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.