BJP: మోదీ, కన్నాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల ఆందోళన

- జన్మభూమి సభకు వచ్చిన సీఎం చంద్రబాబును అడ్డుకోవడంపై ఆగ్రహం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఇంటి ముందు ధర్నా
- పోటీ ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూ మైదానంలో శుక్రవారం జరిగిన ‘జన్మభూమి-మావూరు’ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బీజేపీ శ్రేణులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఆందోళనకు దిగారు.
గుంటూరులో ఉంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ముందు ధర్నాకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు కన్నా ఇంటి ముందు ఆందోళన చేస్తూ ప్రధాని మోదీ, కన్నా లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగడం విశేషం. కన్నాకు మద్దతుగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇరువర్గాల పోటా పోటీ నిరసనలతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.