Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగులో రకుల్ కి మరో ఛాన్స్ 
  • మరో సినిమాలో 'టాక్సీవాలా' నాయిక
  • 'కేజీఎఫ్' ఖాతాలో ఇంకో రికార్డు       

*  గత కొంత కాలంగా తెలుగులో అవకాశాలు పొందలేకపోతున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో గెస్ట్ రోల్ చేసిన రకుల్, ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.
*  యంగ్ హీరో బెల్లంకొండ సురేశ్ తమ్ముడు గణేశ్ కూడా త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. నూతన దర్శకుడు ఫణి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో 'టాక్సీవాలా' ఫేం ప్రియాంకా జువాల్కర్ హీరోయిన్ గా ఎంపికైంది.
*  యశ్ హీరోగా ఇటీవల విడుదలైన 'కేజీఎఫ్' చిత్రం కన్నడ నాట బిగ్గెస్ట్ హిట్ గా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఒక్క కన్నడలోనే 40 కోట్ల షేర్ వసూలు చేసి గత రికార్డులను తిరగరాసింది.

More Telugu News