: సీబీఐపై సుప్రీం వ్యాఖ్యలకు దిగ్విజయ్ స్పందన
సీబీఐ.. పంజరంలో చిలుకలా తయారైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే మన వ్యవస్థలను మనమే కించపరుచుకుంటున్నట్టుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న బెంగళూరులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ బెంచ్.. ఇంటలిజెన్స్ బ్యూరోను కోడిపిల్లగా అభివర్ణించిందన్న దిగ్విజయ్.. ఇలాంటి వ్యాఖ్యల పట్ల స్పందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవస్థలను 'చిలుక', 'కోడిపిల్ల'లతో పోల్చే వారిని తప్పక ప్రశ్నించాలని సూచించారు.