: హోంమంత్రి సబితకు సీబీఐ కోర్టు సమన్లు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ కోర్టు నేడు సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు జూన్ 7న హాజరు కావాలని ఆదేశించింది. జగన్ అవినీతి కేసులో దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై దాఖలైన ఛార్జిషీటును నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ ఛార్జిషీటులో హోం మంత్రి ఏ4 గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన సమయంలో సబిత.. దాల్మియా సిమెంట్స్ కు లబ్ది చేకూర్చేలా వ్యవహరించారని సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే.