: పీసీ వినియోగంపై అవగాహన కార్యక్రమం


పర్సనల్ కంప్యూటర్ ఆవశ్యకతపై 'ఇంటెల్' సంస్థ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని 10 రాష్ట్రాల్లోని 40 నగరాల్లో పీసీల వినియోగంపై అవగాహన కల్పించనున్నట్టు ఆ సంస్ధ ప్రణాళికా విభాగం డైరెక్టర్ జితేంద్ర ఛద్దా తెలిపారు. ఈ ఏడాది ముగిసేనాటికి 1.8 మిలియన్ ఉపాధ్యాయులకు పర్సనల్ కంప్యూటర్ వాడకం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. జాతీయ అక్షరాస్యత మిషన్ లో తమ సంస్థ భాగస్వామ్యం పెరుగుతోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News