: పార్టీని గాడిన పెట్టాలి: రఘవీరా
రాష్ట్రంలో పార్టీని గాడిన పెట్టాల్సి ఉందని మంత్రి రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయిన అనంతరం రఘవీరా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే చేపట్టాల్సిన చర్యల గురించి మేడంతో చర్చించానన్నారు. సీఎం వ్యవహారశైలి, మంత్రులపై అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై అధినేత్రికి వివరించినట్టు తెలిపారు. తాజా చర్చల నేపధ్యంలో రాష్ట్రంలో పార్టీకి మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.