kovera: చెక్ చిరిగిపోవడం వలన సినిమా ఛాన్స్ చేజారిపోయింది: నూతన దర్శకుడు కోవెర

  • ఒక మంచి ఛాన్స్ వచ్చిందని అనుకున్నాను 
  • ఆనందంతో ఇంట్లో వాళ్లకి చెప్పాను 
  • ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోయాను      

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో నూతన దర్శకుడు కోవెర పాల్గొన్నాడు. తన సినిమాను గురించిన విషయాలను ఆయన ప్రస్తావిస్తూ, "చిత్రపరిశ్రమలో రచయితగా .. దర్శకుడిగా నేనేంటన్నది నిరూపించుకోవాలని అనుకున్నాను. కానీ అవకాశం రావడమనేది అంత తేలిక కాదనేది నాకు అర్థమైంది. దాంతో నేనే నిర్మాతగా .. దర్శకుడిగా .. హీరోగా మారిపోయి 'యు' సినిమా చేశాను.

చిత్రపరిశ్రమలో నాకు ఒక చిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ నిర్మాత నాతో సినిమా చేస్తానని చెప్పి అడ్వాన్స్ గా 60 వేల రూపాయలకి చెక్ ఇచ్చాడు. సంతోషంగా ఆ విషయాన్ని మా ఇంట్లో వాళ్లకి చెప్పాను. బ్యాంకుకి వెళ్లి చెక్ బయటికి తీస్తూ ఉండగా చిరిగిపోయింది. బ్యాంకు వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ నిర్మాతకి ఫోన్ చేశాను. 'చెక్ కాపాడుకోలేనివాడివి .. సినిమాను ఎలా కాపాడతావయ్యా' అంటూ ఆయన ఫోన్ పెట్టేశాడు. అప్పుడు వర్షంలో నేను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాను" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News