: ప్రమాణస్వీకారానికి మన్మోహన్ ను ఆహ్వానిస్తా: నవాజ్ షరీఫ్


పాకిస్తాన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పీఎంఎల్-ఎన్ పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా తన ప్రమాణస్వీకారోత్సవానికి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తానని తెలిపారు. శనివారం ముగిసిన పాక్ సార్వత్రిక ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ 125 స్థానాల్లో జయభేరి మోగించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో, ఆ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫే పాక్ భావి ప్రధాని అని అప్పుడే ఖాయమైంది. అయితే, ఈ విషయాన్ని ఇంకా పాక్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీ గెలిచిన పిమ్మట భారత ప్రధాని మన్మోహన్ శుభాభినందనలు తెలియజేశారు. అంతేగాకుండా, భారత్ రావాలంటూ ఆయనకు ఆహ్వానం కూడా పంపారు. ఈ ఆహ్వానానికి షరీఫ్ స్పందిస్తూ, 1999లో నిలిచిపోయిన శాంతి ప్రక్రియను పునఃప్రారంభించాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News