Chandrababu: జలవనరుల సద్వినియోగంలో మనమే బెస్ట్‌...కేంద్రం సహకరించి ఉంటే ఇంకా మంచి ఫలితాలు : చంద్రబాబు

  • నీరు-ప్రగతి పురోగతిపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌
  • పాల్గొన్న కలెక్టర్లు, ఇతర అధికారులు
  • పోలవరానికి అవార్డులపై ముఖ్యమంత్రి హర్షం  

జలవనరులు సద్వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంతో ముందుందని, మన ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ఉంటే ఇంకా మంచి ఫలితాలు సాధించి ఉండేవారమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ‘నీరు-ప్రగతి’పై టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సీబీఐపీ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం తోడ్పాటులేదని, అన్నింటికీ అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తోందని, అయినా పట్టుదలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజా సహకారంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న నమ్మకం తనకుందని చెప్పుకొచ్చారు. తుపాన్‌ బాధితులకు నగదు కొరత లేకుండా చూడాలని సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా సూచించారు. బాధిత రైతులకు బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. పెథాయ్‌ పంట నష్టం అంచనా వెంటనే పూర్తి చేయాలని, రబీ రుణ లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News