చంద్రబాబు గారు.. థ్యాంక్స్!: జగన్ రిప్లై

వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటూ అభిలషించారు. చంద్రబాబు శుభాకాంక్షలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. 'థ్యాంక్యూ ఫర్ ది విషెస్ చంద్రబాబు గారు' అంటూ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు, జగన్ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణలు ఉల్లాసంగా జరుపుకున్నాయి. 


More Telugu News