: జూన్ రెండో వారంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు
మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు చల్లటి కబురు! మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. రుతుపవనాలు జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశిస్తాయని కేంద్ర వాతావరణ విభాగం తెలిపింది. జూన్ మొదటి వారంకల్లా ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.