: టీఆర్ఎస్ వ్యాఖ్యలపై మండిపడ్డ నాగం
తమ మద్దతుతోనే నాగర్ కర్నూల్ ఉపఎన్నికల్లో విజయం సాధించారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్ని శాసన సభ్యుడు నాగం జనార్థనరెడ్డి ఖండించారు. అసలు తెలంగాణకు మద్దతుగా రాజీనామా చేయాలని టీఆర్ఎస్, తెలంగాణ రాజకీయ ఐకాస కోరితేనే రాజీనామా చేశానని నాగం గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు తనపై ఎలా పోటీ చేసేవారని ఆయన టీఆర్ఎస్ నేతలను సూటిగా ప్రశ్నించారు.
తాను ఏ పార్టీకీ కోవర్టును కాదన్న ఆయన, టీడీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పరకాల, కొల్లాపూర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ తరపున తానే ప్రచారం చేశానన్న విషయం ఆ పార్టీ మరవకూడదని నాగం అన్నారు.