: బాలీవుడ్ ఏస్ ఫొటోగ్రాఫర్ జగదీశ్ మాలి కన్నుమూత


బాలీవుడ్ లో ప్రముఖ ఫొటోగ్రాఫర్ గా పేరుగాంచిన జగదీశ్ మాలి నేడు ముంబయిలో మరణించారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసైన మాలి డిప్రెషన్ కు లోనవడంతోపాటు పలు శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఫోటోగ్రాఫర్, ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో మాలి ముంబయి వీధుల్లో మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో తిరుగుతుండగా, నటి మింక్ బ్రార్ గుర్తించారు. అన్నట్టు, జగదీశ్ మాలి మరెవరో కాదు, ప్రముఖ నటి, రాంగోపాల్ వర్మ బ్రాండెడ్ హీరోయిన్ అంతర మాలికి తండ్రే. అంతర తెలుగులో సుమంత్ తో 'ప్రేమకథ' చిత్రంలో కథానాయికగా నటించింది.

  • Loading...

More Telugu News