venkatesh: హుషారుగా సాగిపోతోన్న 'ఎఫ్ 2' సాంగ్

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • జనవరి 12వ తేదీన విడుదల      

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'రెచ్చిపోదాం బ్రదర్' అంటూ సాగే సాంగ్ ప్రోమోను వదిలారు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ .. రాజేంద్ర ప్రసాద్ లపై ఈ సాంగ్ ను విదేశాల్లో చిత్రీకరించారు.

'క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టుందిరో .. 1947 ఆగస్టు 15ని నేడే చూసినట్టుందిరో' అంటూ ఈ సాంగ్ మొదలవుతోంది. 'దొరక్క దొరక్క స్వేచ్ఛ దొరికింది .. బ్యాచిలర్ లైఫ్ లోకి వెళ్లిపోదాం ..ఇలాంటి అవకాశం మళ్లీ రాదు .. రెచ్చిపోదాం బ్రదర్' అనే అర్థంలో ఈ పాట హుషారుగా సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ బాణీ యూత్ కి ఊపుని .. ఉత్సాహాన్ని ఇచ్చేలా వుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ అలరించనున్నారు.

More Telugu News