: గండ్రపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల మండిపాటు


స్పీకర్ విచారణకు హాజరు కాకుండా వైఎస్పార్ సీపీ నేతలు కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారన్న గండ్ర వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండ్రకు తెలుగు చదవడం కూడా ఇబ్బందిగా ఉన్నట్టుందన్నారు. శాసనసభాపతికి విప్ ధిక్కారానికి గల కారణాలను వివరిస్తూ లేఖ రాసామని స్పష్టం చేసారు. దమ్ముంటే తమను అనర్హులుగా ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. 8 కోట్ల మంది ప్రజలను వంచించిన కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా అనర్హత ప్రకటించాలని రాష్ట్రపతిని, ప్రధాన ఎన్నికల కమీషనర్ ను కోరాతామన్నారు.

  • Loading...

More Telugu News