Krishna District: ఎగువ నుంచి వరద... కృష్ణానదిలో క్రమంగా పెరుగుతున్న నీరు... గేట్ల ఎత్తివేత!

  • పెథాయ్ ప్రభావంతో వర్షాలు
  • క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం
  • గేట్లను ఎత్తివేసిన అధికారులు

పెథాయ్ తుపాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండటంతో, ఐదు క్రస్ట్ గేట్లను కొద్దిసేపటి క్రితం ఎత్తివేసిన అధికారులు, నదిలోకి నీటిని విడుదల చేశారు. గుంటూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో ప్రవహిస్తున్న నీరు కృష్ణలో కలవడం, నాగార్జున సాగర్ దిగువ ప్రాంతంలోని వరదనీరు పులిచింతల ప్రాజక్టు దిగువన నదిలో కలుస్తుండటంతోనే ప్రకాశం బ్యారేజ్ లో నీటిమట్టం పెరిగింది. నదిలో నీరు మరింతగా పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి వేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు. 

More Telugu News