: పదవీ బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రులు
కేంద్ర న్యాయశాఖా మంత్రిగా కపిల్ సిబాల్, రైల్వే శాఖా మంత్రిగా పీసీ జోషీ అదనపు బాధ్యతలు స్వీకరించారు. చట్టపరమైన విధానాలు ఆర్ధిక వృద్ధికి అవరోధం కాకుండా చూస్తానని న్యాయశాఖ బాధ్యతలు చేపట్టిన కపిల్ సిబాల్ హామీ ఇచ్చారు. అలాగే ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత ఉండేలా చూస్తానన్నారు. అశ్వినీ కుమార్, బన్సల్ లపై వేటు పడడంతో వారి శాఖల బాధ్యతలను వీరిద్దరూ స్వీకరించారు.