: పదవికోసమే తప్ప తెలంగాణపై ప్రేమతోకాదు: కడియంపై రేవూరి విమర్శ


కడియం శ్రీహరిని రాజకీయ వ్యభిచారిగా అభివర్ణించడంలో ఏమాత్రం తప్పులేదని పీఏసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశరెడ్డి ఈ రోజు వరంగల్ లో అభిప్రాయపడ్డారు. కడియం వ్యాఖ్యలు పార్టీని చులకన చేసేవిగా, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆయన మండిపడ్డారు. కడియం పదవికోసం పార్టీ వీడారు తప్ప, తెలంగాణపై ఉన్న ప్రేమతోకాదని ధ్వజమెత్తారు.

దమ్ముంటే శ్రీహరి ఏ పార్టీనూ చేరకుండా జేఏసీలో చేరి ఉద్యమం చెయ్యాలని ప్రకాష్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణపై మహానాడులో స్పష్టతనిచ్చే వరకూ ఏ పార్టీలోనూ చేరకుండా కడియం ఉండగలరా? అని సూటిగా ప్రశ్నిచారు. మహానాడులో తెలంగాణపై స్పష్టతనిచ్చి పార్టీని కాపాడుకుంటామన్నారు. మరో వైపు ములుగు ఎమ్మెల్యే సీతక్క కడియంకి రాజ్యసభ సీటో, ఎమ్మెల్సీ పదవో ఇస్తే పార్టీ వీడేవారుకాదని ఎద్దేవా చేసారు.

  • Loading...

More Telugu News