Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ విజేతలు వీరే!
- కాంగ్రెస్ అభ్యర్థులు 19 మంది
- టీడీపీ అభ్యర్థులు ఇద్దరు
- బీజేపీ నుంచి ఒకరు విజయం
తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 19 మంది అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నుంచి రాజాసింగ్ గెలిచి మరోసారి తన సత్తా చాటుకున్నారు. కాగా, మొత్తం 119 స్థానాల్లో ఒక్క స్థానం ఫలితం ఇంకా తేలలేదు. తుంగతుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి- హుజూర్ నగర్
భట్టి విక్రమార్క- మధిర
సబితా ఇంద్రారెడ్డి- మహేశ్వరం
శ్రీధర్ బాబు- మంథని
జగ్గారెడ్డి- సంగారెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి- మునుగోడు
వనమా వెంకటేశ్వరరావు- కొత్తగూడెం
గండ్ర వెంకటరమణారెడ్డి- భూపాలపల్లి
సుధీర్ రెడ్డి- ఎల్బీనగర్
చిరుమర్తి లింగయ్య- నకిరేకల్
ఆత్రం సక్కు- ఆసిఫాబాద్
హర్షవర్ధన్ రెడ్డి- కొల్లాపూర్
కందాళం ఉపేందర్ రెడ్డి- పాలేరు
పైలెట్ రోహిత్ రెడ్డి- తాండూరు
పోదెం వీరయ్య- భద్రాచలం
హరిప్రియ- ఇల్లెందు
రేగ కాంతారావు- పినపాక
సురేందర్- కామారెడ్డి
సీతక్క- ములుగు
టీడీపీ విజేతలు
సండ్ర వెంకట వీరయ్య- సత్తుపల్లి, ఎం.నాగేశ్వరరావు- అశ్వారావుపేట
బీజేపీ నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి
రాజాసింగ్- గోషామహల్