bhikshu: నాకు నచ్చిన స్టూడెంట్స్ లో రామ్ ఒకరు: నటుడు భిక్షు
- రామ్ చాలా చురుకైనవాడు
- అతనికి సినిమాయే లోకం
- కుర్రాళ్లంతా మంచి పేరు తెచ్చుకున్నారు
ఒక వైపున సినిమాల్లో నటిస్తూనే ... మరో వైపున యువ నటీనటులకు నటనలో 'భిక్షు' శిక్షణ ఇస్తూ వస్తున్నారు. తాజా ఇంటర్యూలో మాట్లాడుతూ ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. 'దేవదాసు' సినిమా కోసం రామ్ .. ఇలియానాను తీసుకున్నప్పుడు, నటనలో శిక్షణ ఇవ్వడానికి నన్ను పిలిపించారు. రామ్ చాలా చురుకుగా.. చలాకీగా ఉండేవాడు. సినిమాయే తనలోకం అన్నట్టుగా ఉండేవాడు. ఆయన అంకితభావం చూసి నాకే ఆశ్చర్యం వేసింది.
ఇక నాగశౌర్య .. సాయిధరమ్ తేజ్ కి కూడా నటనలో మెళకువలు చెప్పాను. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నా దగ్గరికే వచ్చాడు. మంచి దీక్ష .. పట్టుదల కలిగిన కుర్రాడతను. నా దగ్గరికి వచ్చినప్పుడు 120 కేజీల బరువు ఉండేవాడు. ఆ తరువాత మంచి ఫిట్ నెస్ సాధించాడు. వీళ్లంతా కూడా ఎంతో కష్టపడి హీరోలుగా మంచి స్థానాల్లో కొనసాగుతున్నారు .. అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది" అని చెప్పుకొచ్చారు.