Border: సరిహద్దులో 66 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వర్గాలు

  • విలువ రూ.21 కోట్లు పైమాటే 
  • నలుగురు వ్యక్తుల అరెస్టు
  • శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ ఐదు కేజీలు స్వాధీనం

భారత్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు సరిహద్దులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చైనా, బర్మా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకువస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.21 కోట్ల పైమాటేనని తెలుస్తోంది. ఈ సందర్భంగా నలుగురు నిందితులను అరెస్టు చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ముఠాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏజెంట్లు ఉన్నారన్న దానిపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుండగా శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ కస్టమ్స్‌ అధికారులు దాదాపు ఐదు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి జైపూర్‌ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణానికి సిద్ధమవుతున్న రామేశ్వర్‌ అనే వ్యక్తి వద్ద రెండు బంగారు కడ్డీలు గుర్తించారు. వీటి బరువు ఐదు కేజీలుంటుందని భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు.

More Telugu News