surya: భారీ రేటుకు 'ఎన్జీకే' ఆడియో హక్కులు

  • సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే'
  • డిఫరెంట్ లుక్స్ తో సూర్య 
  • హిట్ ఖాయమంటోన్న ఫ్యాన్స్  

సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'ఎన్జీకే' సినిమా రూపొందుతోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది. డిఫరెంట్ లుక్స్ తో సూర్య కనిపించనున్న ఈ సినిమాలో, ఒక కథానాయికగా రకుల్ .. మరో కథానాయికగా సాయిపల్లవి కనిపించనున్నారు.

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను భారీ రేటుకు సోనీ మ్యూజిక్ సౌత్ వారు దక్కించుకున్నట్టుగా సమాచారం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాపై సూర్య గట్టి ఆశలే పెట్టుకున్నాడని అంటున్నారు. సూర్య ఆశించే హిట్ ఈ సినిమాతో దొరుకుతుందనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   

More Telugu News