: ఆరుషి హత్యకేసులో తండ్రి పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
దేశంలో సంచలనం రేకెత్తించిన ఆరుషీ తల్వార్ హత్య కేసులో ఆమె తండ్రి రాజేష్ తల్వార్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు ఈ రోజు తోసిపుచ్చింది. ఈ కేసులో మరో 14 మంది సాక్షుల వాంగ్మూలం నమోదు చెయ్యాలన్న తల్వార్ పిటీషన్ ను తిరస్కరించింది. కింది కోర్టు ఉత్తర్వులపై నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైకోర్టులో పిటీషన్ వెయ్యండంటూ సూచించింది.